చిత్తూరు ( జనస్వరం ) : అనంతపురం జిల్లా రాప్తాడులో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని, ఈ దాడి వైసీపీ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్థంభం లాంటి వారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు పత్రికా విలేకరులపై దాడి చెయ్యడం హేయమైన చర్య అని ఆరోపించారు. జర్నలిస్టులపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండడం సిగ్గుచేటన్నారు. ఎక్కడో అనంతపురం జిల్లాలో నిర్వహించే కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు, వృద్ధులు, బాలింతలు రవాణా సౌకర్యం లేక తల్లడిల్లిపోయారని తెలిపారు. ప్రజా ధనాన్ని స్వార్థం కోసం వాడుకోవడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యమా, వైసీపీ రౌడీ రాజ్యమా అని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షసపాలన నుంచి జనసేన, టీటీడీ సంయుక్తంగా ప్రజలకు విముక్తి కలిగిస్తుంది భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఎన్నడూ సీఎం సభలో జర్నలిస్టులపై దాడి సంఘటన జరగలేదని తెలిపారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన విలేకరిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ వైసీపీ గూండాలను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాళరాస్తూ వైసీపీ అరాచకాలకు పాల్పడ్డ నిందితులను గుర్తించి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com