Date of Publish : 21 September 2022, 4:17 pm
Editor : Sake Naresh
గ్రామ స్థాయి నుండి జనసేనపార్టీని బలోపేతం చేయండి : చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం ( జనస్వరం ) : క్షేత్రస్థాయి నుంచి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ లోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి దాదాపు 60 కుటుంబాలు బుధ వారం చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు జింక శివకుమార్, సరిబాల రమేష్ రెడ్డి, ఈడిగుడ్డు వెంకట రాముడు, దాసరి కేశవ, యనమల నరసింహ, పూలశెట్టి ముని, దాసరి దామోదర్, సదనపు ఆది, జింక హరికుమార్, గడ్డం శివ, జె. మురళి, ఆర్.అంజి, సి. సి బాబా ఫక్రుద్దీన్, వి. నారాయణస్వామి, ఎం . పరమేష్, ఎస్. బాబావాలి, కె. శ్రీనివాసులు, జి. బాలకృష్ణ, బి. జగదీష్ మరియు మొదలగు వారు చేరారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల కోసం నిరంతరం తాను అందుబాటులో ఉంటూ ఎవ్వరికి ఏ ఆపద వచ్చిన తాను ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మధుసూదన రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
All Rights Reserved By Janaswaram News.