అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం కేంద్రం బస్కి పంచాయితీ పరిధిలో గల జాతర వలస గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం 7 గంటల సమయంలో ఆయా గ్రామంలో జనసేన బృందం పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై గ్రామ సమస్యలు పట్ల చర్చించారు. ఆయా గ్రామాల్లో వీధిలైట్స్ లేక గ్రామస్తులు చీకటిలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఇంతే కాకుండా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యతో తీవ్రంగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన జనసేన పార్టీ ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం అయ్యేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ఈ సందర్భంగా జనసేన మాటలు జనసేన సిద్ధంతాలు గిరిజనులకు క్లుప్తంగా వివరించారు. రాష్ట్రంలోని జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు. అనంతరం జాకర వలస గ్రామాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నినాదాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు బొండం లక్ష్మణరావు, బంగారు రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.