Logo
Date of Publish : 30 June 2022, 1:51 am
Editor : Sake Naresh

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని వింతలు, విడ్డురాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

    చిత్తూరు, (జనస్వరం) : ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి రూ.800 కోట్లు మాయం అయిపోయాయి. జగన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అనేక వర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని వర్గాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా జగన్ రెడ్డి మోసం చేశారు. వారంలో CPS రద్దు అని ఇప్పుడు అసాధ్యం అంటున్నారు. ఇప్పుడు ఏకంగా డీఏ ఏరియర్స్ సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లో పడినట్లే పడి మాయం అయిపోయాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో నుండి డబ్బు వెనక్కి తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అర్దం. కానీ ఆర్ధిక మంత్రి మాత్రం ఏ ఇబ్బందులూ లేవని అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలారా! జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల మాటున ఆర్ధిక క్రమశిక్షణను అస్సలు పాటించడం లేదు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇవన్నీ గమనించి రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని దారం అనిత తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com