అనంతపురం, (జనస్వరం) : నాటుసారా తయారీని అరికట్టలేక బెల్లం టోకు విక్రయదారులు పైన సెబ్ అధికారులు విచిత్రమైన ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు? అని అనంత జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి పత్రిక ముఖంగా అన్నారు. బెల్లం అమ్మే దుకాణదారులు పైన తక్షణమే సెబ్ అధికారులు, ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు సడలించి బెల్లం విక్రయించే వర్తక వ్యాపార రంగానికి సహకరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బెల్లం విక్రయదారులకు, బెల్లం అనుబంధంగా చిరుతిండ్లు తయారుచేసి విక్రయించే చిరు దుకాణాలకు, కార్మికులకు జనసేనపార్టీ అండగా నిలిచి ప్రభుత్వం మెడలు వంచుతామని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com