ఒంగోలు, (జనస్వరం) : విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడడానికి అఖిలపక్షం పెట్టమని అడిగిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, వైసిపి నాయకులు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ప్రకాశం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ డిమాండ్ చేచేశారు. ఒంగోలులో మంగళవారం ఒక ప్రకటన చేస్తూ కేసులకు భయపడ్డారా లేదా లోపాయకారి ఒప్పందం ఏదైనా చేసుకున్నారా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే సినిమా డైలాగులు అంటు మీరు పెడుతున్న ప్రెస్ మీట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు పెట్టడం లేదు. వైసీపీ నాయకులకు మా జనసైనికుల హెచ్చరిక మాకు బూతులు మాట్లాడటం చేతకాక కాదు. మేము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని ఆమె అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మాని ప్రజా సమస్యలను పరిష్కరించాలి అరుణ కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com