నెల్లూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్స్ వారికీ ఇష్ట వచినట్లుగ రేట్లు వసూలు చేస్తున్నారని నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు నెల్లూరు పెద్దాసుపత్రి ను0చి పొగతోటకు 3 కిలోమేటర్ల గాను 5వేల నుంచి 10వేల రూపాల వరకు వసూలు చేస్తున్నారు. ఇంకా నారాయణ హాస్పిటల్ కి ఐతే లేదా మరి ఏ ఇతర దూర ప్రాంతాలకైతే వారు చెప్పిందే రేటుగ వుంది. వారి అవసరన్ని బట్టి పేద మధ్య తరగతి మరియు బడుగు బలహీన వర్గాలుఐతే చాల దారుణంగ వుంది. కనుక నెల్లూరు జిల్లా ఉపరవాణ కమీషనర్ వారు చొరవ తీసుకోని పై సమస్య పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, దూరాన్ని బట్టి ఛార్జ్ చేయాలని సూచిస్తూ ప్రతి అంబులెన్స్ పై స్టికర్ అంటించాలని, లేనిచో ముఖ్యమైన ప్రదేశాలలో కిలోమిటర్ కి ఇంత అని సూచిస్తూ పట్టికని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము అన్నారు. అలాగే గత ముడువారాల క్రితం ఈ విషయమై వినతిని అందించామని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదాని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ దాడిని అరికట్టండి అంటూ మరోసారి D.T.C గారిని కలసి ఇటీవల తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ బాడుగ రావడం లేదని హాస్పిటల్ లోనీ I.C.U లోకి వెళ్ళి ఆక్సిజన్ ఆపివేయడంతో ఇది చూసిన సిబ్బంది అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. అలాంటి పరిస్థితి ఆంధ్రాలో తలెత్తకుడదన్న ఉద్దేశంతో ఎవరైతే ఇలాంటి రక్తపు కూడు కోసం అలవాటు పడ్డారో అలాంటి అంబులెన్స్ డ్రైవర్ ల పై కఠినంగా దాడులు జరపాలని జనసేన తరుపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ నాయకులు శ్రీపతి రాము గారు, సాయి, సంపత్, కమల్, సందీప్ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com