నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి తమ కార్యవర్గంతో ఎమ్మార్వో గారికి మైనింగ్ డిపార్ట్మెంట్ కి మరియు జలవనరుల శాఖ ఎస్సీ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కోవూరు నియోజకవర్గంలో ఒక వైపు నుంచి గ్రావెలు మరోవైపు నుంచి ఇసుక అక్రమంగా కిలోమీటర్ల మేర 30 అడుగులలో పైబడి అక్రమంగా కోట్లాది రూపాయల సంపద అక్రమ రవాణా జరుగుతుంది. రానున్న తర్వాత ఒక గంపడు గ్రావెల్ ఇసుక దొరికే పరిస్థితి ఉండదు ఏమో అనిపిస్తుంది. వైసీపీ నాయకులకు తలొగ్గి పనిచేస్తున్న అధికారులు అందరికీ ఒకటే చెబుతున్నా ఈ ప్రభుత్వం ఎనిమిది నెలలకు మించి నిలబడదు రానున్న ప్రభుత్వాలకి మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. వారి అక్రమ సంపాదనకు మీరు సాక్షులుగా నిలవద్దు. ఈ రోజు ఉదయం జమ్మిపాలెం వద్ద అధికారులు తనిఖీ చేసే గంట వదిలేసి యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. ఈ విషయమై జల వనరుల శాఖ ఎస్సీ గారిని ఎమ్మార్వో గారిని మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ ని సంప్రదించడం జరిగింది. ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇది ప్రజా ఉపయోగాలు కోసం సేకరించినదా లేదా అక్రమంగా తరలిపోతుందా విచారణ చేపట్టి దోషం శిక్షించాల్సిన పరిస్థితి ఉందని తెలియజేశారు. సరైనా అనుమతులు చూపకుండా జగన్ ఇళ్లకు తోలుతున్నామని చెప్పినా..ఆయా ప్రదేశాల్లో ఇసుక అవసరత లేకపోయినప్పటికీ రోజూ లెక్క లేనన్ని ట్రాక్టర్ల తో అక్రమ రవాణా వలన స్థానికులకు ఇసుక గ్రావెల్ అందని పరిస్థితి. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు అవసరాలకి గ్రావెల్ ఇసుక దొరికే పరిస్థితి లేదు. మాఫియా మహమ్మారిని వీలైనంత త్వరగా కట్టడి చేయాలి లేనియెడల జనసేన పార్టీ తరఫున ఆందోళన చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా రేపు మాపు వచ్చే వరదల నుంచి కూడా గ్రామాల కాపాడాల్సిన అవసరతను తెలుపుతూ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుదీర్ బద్దపూడి, జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సిటీ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, సిటీ నాయకులు షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com