ఎమ్మిగనూరు ( జనస్వరం ) : సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు మానేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలపై స్పందించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కాసా రవి ప్రకాష్, కరణం రవి, రాహుల్ సాగర్, లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు మా అధినేత జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగత విమర్శలు మానేసి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ప్రజా సమస్యలపై స్పందించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు తాను మేనమామ అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు నేర్పించేది వ్యక్తిగత విమర్శలేనా అని ప్రశ్నించారు. ఎలక్షన్ ముందు ప్రతిఇంట్లో ఇద్దరికి అమ్మఒడి ఇస్తాము అన్న మేన మామ హామీ ఏమైందని అలాగే 45 సంవత్సరాలకే పెంక్షన్ ఇస్తాను అన్న హామీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటు పోతే మీరు ఇచ్చిన హామీలు చాలా వున్నాయి అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం సహజమేనని ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ లేవనెత్తినప్పుడు అధికార పక్షంలో ఉన్న మీరు ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తారో ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఎలా అందిస్తారో తెలపాలని దాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు మానేసి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, నవాజ్, రవి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.