Logo
Date of Publish : 05 July 2023, 3:41 pm
Editor : Sake Naresh

అత్యం క్వారీ ఆగడాలను అరికట్టండి : జనసేన పార్టీ నాయకులు

          పార్వతీపురం ( జనస్వరం ) : పార్వతీపురం సమీపంలోని కొంకిడివరం, పెదగుడబ పరిసరాల్లో ఉన్న అత్యంత వారి ఆగడాలను అరికట్టాలని కొంకిడివరం సర్పంచ్ అల్లు అప్పలనాయుడు జనసేన పార్టీ కార్యనిర్వాహణ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, వంగల దాలి నాయుడు, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు, తెంటు శ్రీకాంత్, చింతాడ కామేష్, అలజింగి సింహాచలం, యోగి రెడ్డి అప్పలనాయుడు, అల్లు హరికృష, గౌరీ శంకర్, రఘు మండల అప్పలనాయుడు, చిట్ల గణేష్ , చీమల సతీష్, నేరేడు బిల్లీ వంశీ, రమేష్ తదితరులు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్ .పి. డాక్టర్ ఓ. దిలీప్ కిరణ్ కలిసి ఆత్యం క్వారీ చేస్తున్న ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీ అనుమతులు లేకుండా తారు, సిమెంట్, బ్లాస్టింగ్, క్రషర్ తదితర కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఆయా కార్యక్రమాలకు గాను క్వారీ నుండి గ్రామాల సమీపంలో ప్రైవేటు వ్యక్తుల తోటలో మొక్కలు తొలగించి రోడ్డు వేసి దౌర్జన్యంగా వాహనాలను రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఆయా వాహనాలు రాకపోకల వలన పరిసర గ్రామాలు పెదగుడబ, కొంకడివరం తదితర గ్రామాల ప్రజలు పిల్లలు, అవస్థలు పడుతున్నారన్నారు. బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటి వలన పొల్యూషన్ పెరిగి, పర్యావరణం దెబ్బతిని గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన జిల్లా అదనపు ఎస్పీ తగు చర్యలు చేపడతామన్నారు . ప్రభుత్వ నిధులు సుమారు రెండు కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులతో ఎవరికి ఉపయోగం లేని రోడ్డు వేయటం పట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని తీసుకునేందుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు కలిసి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని వ్యవహరించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ తో మాట్లాడి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com