కదిరి ( జనస్వరం ) : దేశంలో గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పట్టుబతున్నాయి వీటికి కేంద్రబిందువు మన ఆంధ్రప్రదేశ్ కావడం, రాష్ట్ర యువత భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధ కలుగుతోందని జనసేన నాయకులు అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మత్తు పదార్థాలపై ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల “గంజాయి ఆంధ్రప్రదేశ్” గా మారుతోంది అని రాష్ట్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జగన్ రెడ్డి మద్యపానాన్ని పూర్తిగా నిషేదిస్తామని హామీ ఇచ్చి మాట మార్చడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అసాంఘిక ఘటనలు చాలా వరకు మద్యం, గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్లనే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ రాష్ట్ర హోం మంత్రి, రాష్ట్ర పోలీస్ కమిషనర్ గంజాయి, హెరాయిన్ అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కదిరి పట్టణంలో చాలా వరకు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. నిత్యం మద్యం మత్తులో గొడవలకు దిగటం వాహనాలు ఎలా పడితే అలా నడపటం,ముఖ్యంగా కదిరి పట్టణంలో కొన్ని కొన్ని ( ఉదా: సున్నపు గుట్ట తాండా,నిజాం వలి కాలనీ, అడపాల వీధి,) ప్రాంతాల్లో మత్తులో ఆడబిడ్డలపై ర్యాగింగ్ కు పాల్పడటం వల్ల తల్లి తండ్రులు తమ బిడ్డలను పాఠశాలకు, ట్యూషన్స్ కి పంపించాలి అంటేనే భయపడుతున్నారు. కావున పోలీసు అధికారులు ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికి వారి తల్లి తండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఇందుకు జన సేన పార్టీ తరపున మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నామని కదిరి జన సేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్,కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ నాయకులు గంగరాజు, శ్రీనివాసులు, గంగులప్ప, అంకాలప్ప,కదిరి ఐటీ వింగ్ కోఆర్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్, పులగంపల్లి రాజా, సాడగల గణేష్ రాజ్, అన్నం జయ వర్ధన్,గుంత ప్రతాప్, భరత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.