Logo
Date of Publish : 28 March 2022, 3:52 pm
Editor : Sake Naresh

సినిమా టికెట్లపై దిగజారుడు రాజకీయాలు మాని, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టండి : జనసేన నాయకులు త్యాడా రామకృష్ణారావు(బాలు)

● తెల్లారితే తిట్టేది పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని. తిరిగి వారి సినిమా టిక్కట్లు మీకే కావాలి?
● ప్రజా ప్రతినిధులా? సినిమా టిక్కట్ల వ్యాపారస్తులా?

● స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డ జనసేన నాయకుడు

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సినిమా టిక్కట్లపై దిగజారుడు రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అన్నారు. శుక్రవారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్. టి. ఆర్. నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సందర్బంగా విజయనగరంలో మెగాభిమానులకు, సామాన్య ప్రజానీకానికి, అధికార పార్టీ నాయకులు, వైస్సార్సీపీ నాయకుల వద్ద అనుచరులైన చిరు అభిమానుల ముసుగులోఉన్న సీజనల్ వ్యాపారస్థులు టిక్కట్లు లేకుండా తీవ్ర అన్యాయం చేశారని శనివారం విడుదల చేసిన ఓ పత్రికాప్రకటనలో దుయ్యబట్టారు. తెల్లారితే రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని తిట్టే వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి సినిమాలు విడుదల అవ్వగానే వారి టిక్కట్లపై మాత్రం వ్యాపారం చేసుకోవడం విడ్డూరమని అన్నారు. ఇకపోతే ఈ ఆర్.ఆర్.ఆర్. సినిమా టిక్కట్లు ప్రతీ కార్పొరేటర్లకు స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా టిక్కట్లు ఇచ్చి ఒకొత్త సంస్కృతికి ఎమ్మెల్యే నాంది పలికారని, సంవత్సరం దాటినా విజయనగరంలో ఉన్న కాలువల్లో బ్లీచింగ్ వేయట్లేదు. ఈ దిగజారుడు రాజకీయాలు మాని పాలకులు ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టాలని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com