ఎమ్మిగనూరు ( జనస్వరం ) : స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, కర్ణం రవి, రాహుల్ సాగర్, లు మాట్లాడుతూ 2019 ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో జగన్మోహన్ రెడ్డి,ని ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షాల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ అభివృద్ధిని మరిచి కాలం గడిపేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ జనసేన పార్టీకి నాయకులు ఉన్నారో లేదో గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నారో లేదో అనేది 2024 లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని మీరు జనసేన పార్టీ గురించి ఆలోచించడం మానేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తే బాగుంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, నాగరాజ్, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com