నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 124వ రోజున 50వ డివిజన్ రంగనాయకులపేటలోని ఉప్పరపాలెంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజాసమస్యల అధ్యయనం చేసి ఆ సమస్యల పట్ల పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పరపాలెంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు. వీధుల్లో చెత్త చెదరాలు పేరుకుపోయి ఉన్నాయని, సైడు కాలువలు పూడిక తీత లేక, డ్రైనేజీ వ్యవస్థతో సరైన అనుసంధానం లేక దుర్గంధభరితంగా ఉన్నాయన్నారు. రాత్రయితే దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. నగరంలో ఇప్పటికే డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాల సంఖ్య పెరుగుతోందని, పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు సరైన చర్యలు చేపట్టకపోతే జ్వరాలు మరింతగా ప్రబలే అవకాశం ఉందన్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.