Logo
Date of Publish : 28 January 2024, 8:58 pm
Editor : Sake Naresh

రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అభిమానుల ఆత్మీయ సమావేశం

   నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రౌండ్ టేబుల్ నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షులు పి.టోనీ బాబు.  రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షుడు పి.టోనీ బాబు మాట్లాడుతూ ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని సైనికుడై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న వేలాది అభిమానుల అభిమానాన్ని జనసేన ఓటుగా మార్చడానికి కార్యచరణ రూపొందించుకున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ విజయం కోసం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమం అనంతరం ఐదు ముఖ్యమైన తీర్మానాలతో ప్రమాణాలు చేయడం జరిగింది.

1. రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానులందరు ఏకధాటిగా పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడివుండటం.

2. జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయం కొరకు ముందుకు సాగడం.

3. పవన్ కళ్యాణ్ అభిమానులు 2014 సం''లో పనిచేసిన ప్రతి కుటుంబాన్ని కలిసి జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయం కొరకు తోడ్పడటం.

4. ప్రతి ఇంటిటికి జనసేన మేనిపేస్టోని తీసుకెళ్లడం.

5. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వారధిగా ఒక నాయకున్ని ఎన్నుకోవడం.

పై తీర్మానాలను వచ్చిన ప్రతి ఒక్కరు ఆమోదించి తీర్మానించుకోవడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో
బండ్రెడ్డి చందు గారు(విజయవాడ), సురేష్(ఒంగోలు), శివ(విజయవాడ), రవి(వినుకొండ), సోమశేఖర్(తిరుపతి), రామకృష్ణ(తెనాలి), విజయ్, గోపి(కర్నూలు), అలీ(హైదరాబాద్) నెల్లూరు జిల్లా నుండి డా. కత్తి తిరుమల , శ్రీపతి రాము, మురళి, భిమారావు, ప్రవీణ్, కాకి శివ,సుబ్బు, శ్రీనివాసులు, రాము, శ్రీను, వెంకీ, భాను ప్రకాష్, పృథ్వి,అమరావతి రాజా, షాన్వాజ్, బాజి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com