
నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో పదవ డివిజన్ స్థానిక జనసేన కార్యకర్త హేమచంద్ర యాదవ్ ఇంటి వద్ద జనసేన పార్టీ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చి మోసపోయారు,ఇబ్బందులకు గురి అవుతున్నారు. మూడవ ప్రత్యామ్నాయం ఎదగాల్సిన అవసరం ఉందని సమాజ శ్రేయస్సును కాంక్షించే సుదీర్ఘ ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా తగిన వ్యక్తి. ఒకసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీని గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు.పాతిక సంవత్సరాల మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రగతి కై అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో పాటు హేమ చంద్రయాదవ్, కంతర్, అమీన్, ప్రశాంత్ గౌడ్, మౌనిష్, హరి, షాజహాన్, ప్రసన్న, చిన్న రాజా, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.