కదిరి ( జనస్వరం ) : ఆత్మహత్య చేసుకున్న 3000 కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన స్వంత డబ్బులు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారని కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన నాయకులు మాట్లాడారు. కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున చనిపోయినా కౌలు రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు వారి ఖాతాలలో వేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విమర్శన చేయాలని హితువు పలికారు. ప్రభుత్వం చేయలేని పనిని మా అధ్యక్షులు చేస్తే రాష్ట్ర వైసీపీ మంత్రులు వ్యక్తిగత దూషణలు చేస్తారా ? మీరు ఇలాగే వ్యక్తిగత దూషణలు చేస్తే మేము కూడా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో పెద్దపాలేరును అని పేర్ని నాని వచ్చి ఇలాగే విమర్శించినారు. ఇప్పుడు ఏమయ్యారో ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు కొత్తగా పాలేరు ఉద్యోగం తీసుకొని పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి వచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత మీరు ఏమవుతారు ఒకసారి చూసుకోండని హెచ్చరించారు. కొత్తగా మంత్రి పదవిలోకి వచ్చారు. మీరు ప్రజలకు ప్రజాసేవ చేయాల్సి ఉంటుంది. వాటిపై సమీక్షలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలి కానీ కేవలం విమర్శల కొరకే మంత్రి పదవులు తీసుకున్నట్లు ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తొందర్లో మిమ్మల్ని వీధుల్లో రాళ్లతో తరిమితరిమి కొడతారని అలాంటివి జరగకుండా ముందుగా జాగ్రత్త పడాలని తెలియజేశారు. రాప్తాడు జనసేన ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, సామాన్యుడి కనీస అవసరాలు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. ముందు వీటిని అదుపులో పెట్టాలని లేనిచో ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వైసీపీ మంత్రులు ఇలాగే పవన్ కళ్యాణ్ గారి మీద దిగుడు జారుడు మాటలు మాట్లాడితే మేము సహించేది లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చేస్తారన్నారు . ఈ కార్యక్రమంలో కదిరి రూరల్ మండల అధ్యక్షుడు మహేష్, కుటాల లక్ష్మణ్, చెక్క రమణ, అంజిబాబు, ఈటె లోకేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.