Search
Close this search box.
Search
Close this search box.

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది : మార్కాపురం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

పెట్రో

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది
– ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చెప్పింది అక్షర సత్యం
– రూ.6 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉందని చెప్పారు
– ఈ అంశంపై అన్ని వర్గాల వారూ ఆలోచించాలి… చర్చించాలి
– వేల కోట్ల రుణాలు తెచ్చి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు
– వెలిగొండ ప్రాజెక్టుపై జగన్‌ మాట తప్పారు
– నిర్వాసితులకు అండగా జనసేన పోరాటం చేస్తుంది
– మార్కాపురం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌
       అమరావతి, (జనస్వరం) : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధఃపాతాళానికి పడిపోయిందని, ఇదే విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చెప్పారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. రాష్ట్రం రూ. 6 లక్షల కోట్ల అప్పుల్లో ఊబిలో కూరుకుపోయిందని, ఆంధ్రప్రదేశ్‌ అనగానే రుణాల కోసం వచ్చారా అనే అడిగే పరిస్థితికి రాష్ట్ర పరువును దిగజార్చడం సిగ్గుచేటన్నారు. మున్సిపాలిటీల్లో నిధులు లేవు, పంచాయతీల్లో నిధులు లేవు… తీసుకొస్తున్న రుణాలు ఎటు పోతున్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. మార్కాపురం నియోజకవర్గం పరిధిలో పొదిలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ “మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాట్లాడిన అంశంలో లోతైన అర్ధం ఉంది. ఈ రోజు దేశం మొత్తం మన వైపు చూస్తూ… ఇన్ని లక్షల కోట్ల రుణాలు
తీసుకెళ్లి ఏం చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం… పదిమంది యువతకైనా ఉద్యోగాలు ఇచ్చిందా? కనీసం కొత్త రోడ్లు కాదు ధ్వంసమైన రోడ్డును మరమ్మతులు చేసిందా?ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్య పరిమితమైతే… సలహాదారులు వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు” అని అన్నారు.

ఫోటో పెట్టుకుంటే సరిపోదు…
“వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేసినప్పుడు నేను కూడా వచ్చాను. మూడు జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇది. 43 టి.ఎం.సి. నీటిని స్టోర్‌ చేసి దాదాపు 4.5 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆదునిక టెక్నాలజీ ద్వారా స్వరంగాలు తవ్వి ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలని ఆనాడు నిర్ణయించారు. ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని, ఆయన ఫోటో పెట్టుకొని ఇంటింటికి తిరిగి పాదయాత్ర చేసి, ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ ఏమైంది. ఎందుకు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకొనే మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా వెలిగొండ ప్రాజెక్టుపై సమగ్ర నివేదికలు తెప్పించుకొని, ప్రాజెక్టు అంచనాలు, నిర్వాసితులకు పునరావాసం, చుట్టు పక్కల ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చవుతుందో కచ్చితంగా అంచనాలు వేసుకోండి. ఏదో పబ్లిక్‌ మీటింగ్‌ లో మూడు ముక్కలు చెప్పి వెళ్లిపోతే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు పవన్‌ కళ్యాణ్‌ మీకు అండగా ఉంటారు. అవసరమైతే మీకోసం పోరాటం చేస్తారు”.

* చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి జరిగేది
పీరమెక్కిన పాలకుల్లో చిత్తశుద్ది ఉంటే ప్రకాశం జిల్లా ఎప్పుడో అభివృద్ధి చెందేది. ఇక్కడ ప్రకృతి వనరులకు లోటు లేదు. ప్రజల్లో కష్టపడే మనస్తత్వం ఉంది. కుటుంబాలను పోషించుకోవడానికి పొట్ట చేతపట్టుకొని పక్క జిల్లాలకు వలసలు పోతున్నారు. ఇలాంటి వారిని చూసైన సీఎం మనసు కరగడం లేదు. ఈ ప్రాంతంలో ఎన్నో గనులున్నాయి. స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించవచ్చు. మార్కాపురం అంటే పలకల పరిశ్రమకు ఏమన్‌. ఇప్పుడు ఆ పరిశ్రమ ఏమైపోయింది. ఈ ప్రాంతంలో దాదాపు 40 వేల మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. వారిని ఉన్నత చదువులు చదివించి ఉద్యోగాలు వచ్చేలా ఎందుకు చేయలేరు? వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన రుణాలు ఇచ్చి ఆదుకోలేరా? మీలో నిజంగా నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ సాధ్యమే. కులాలు, మతాలకు అతీతంగా మాట్లాడే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. సమాజంలో ముస్లిం సోదరులకు సరైన స్థానం కల్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.

ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదు
తాడేపల్లికి కూతవేటు దూరంలోనే అత్యాచారం జరిగితే బాధితురాలికి ఇప్పటి వరకు న్యాయం చేయలేని
ముఖ్యమంత్రి… ఈ ప్రాంతానికి ఏం న్యాయం చేస్తారు. అందుకే ప్రజలకు అండగా నిలబడే నాయకులను ఎన్నుకోవాలి. వైసీపీ నాయకులకు ల్యాండ్‌ సెటిల్మెంట్లలో ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదు. రాబోయే
రోజుల్లో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలపై ఉద్యమిద్దాం… సిద్ధమవ్వండి. అందరం కలిసి కష్టపడితే మంచి రోజులు వస్తాయి. పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయ్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షులు షేక్‌ రియాజ్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.పాకనాటి గౌతంరాజ్‌, జిల్లా నాయకులు పులి మల్లికార్జున్‌, చిట్టెం ప్రసాద్‌, చీకటి వంశీ, మలగా రమేష్‌, సాదిక్‌, తిరుమలశెట్టి వీరయ్య, వరికూటి నాగరాజు తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way