అనంతపురం ( జనస్వరం ) : వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విఫలం కావడంతో రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే కోసం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరణ పేరుతో అధికార మదమెక్కి, రాష్ట్ర ప్రభుత్వం మరియు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలని, దాస్టీ కాలనీ వ్యతిరేకిస్తున్నామని అననతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని విశాఖపట్నంలో ప్రజా సంపదను దాదాపు 175 కోట్లు ఖర్చుపెట్టి గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులు ఘనంగా ప్రారంభించింది. మొదటి రోజున వచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలందరూ కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చారు, ఇన్వెస్ట్ చేయడానికి రాలేదనేది రాష్ట్ర ప్రజలకు అర్థమయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొన్ని కంపెనీలకు భూములు కేటాయించింది వారిని కూడా వేదికపై తీసుకొచ్చి కొత్తగా ఎంఓయూలు చేసుకున్నట్లుగా అబూత కల్పనలు కల్పించే ప్రయత్నం చేసింది. సాయంత్రానికే ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ ఉంది? ఎంఓయూ చేసుకున్న కంపెనీలన్నీ ఎప్పుడు పరిశ్రమలు కట్టాలి? కట్టిన తర్వాతే కదా ఉద్యోగాలు వచ్చేది? అనే అంశం రాష్ట్ర ప్రజలకు అర్థం అయిపోయింది. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చి 14 జనసేన ఆవిర్భావ సభకు రైతులు స్థలమిచ్చారని వారి ప్రహరీ గోడల్ని కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేవలం ఇప్పటం గ్రామంలోనే రోడ్డు విస్తరణ చేస్తారా రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న రోడ్ల దుస్థితి ఏమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం? జనసేన పార్టీ రైతులకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటంలో గ్రామంలో దౌర్జన్యాలకు, దాస్టికానాలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నామని అన్నారు.