కదిరి, (జనస్వరం) : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై ఐదు రూపాయలు, డీజిల్ పై పది రూపాయలు పన్నులు తగ్గించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై తమ వాటా పన్నులను తగ్గించాయి. దీని వలన ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ తక్కువ ధరకే వస్తున్నందున మిగతా ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు తగ్గడానికి ఆస్కారం ఏర్పడింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వ వాటా పన్నులను తగ్గించడానికి ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే రోడ్డుపై కూడా వందల కోట్ల రూపాయలు పన్ను పేరుతో వసూలు చేయడం జరుగుతోంది. కానీ ఒక్క కిలో మీటర్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు కనిపించలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదు. ప్రజా సొమ్ము వివిధ పథకాల పేరుతో దుర్వినియోగం చేయడానికి, అలాగే సలహాదారుల పేరుతో వారికి జీతభత్యాలు చెల్లించడానికి, వారి స్వంత పేపర్లకు ప్రకటనలు ఇవ్వడానికి దుర్వినియోగం చేస్తోంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ కావడమే గమనార్హం. దీన్ని చూస్తూ జనసేన పార్టీ ఉండదు అని తెలియజేస్తున్నాం. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో తెలియజేస్తామని, అలాగే పెట్రోల్, డీజల్ పై పన్నులు తగ్గించే వరకు పోరాడతామని కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ప్రకటనలో తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com