Logo
Date of Publish : 13 January 2022, 4:35 pm
Editor : Sake Naresh

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

 - ప్రజలంతా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

- కోవిడ్ నిబంధనలతో పండుగ జరుపుకోవాలని పిలుపు.

- పండగ పూట రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్న వైస్సార్సీపీ ప్రభుత్వం?
      విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంఛార్జ్ పాలవలస యశస్వి జిల్లా ప్రజలకు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ కేసులు అమాంతంగా పెరుగుతున్న తరుణంలో కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందరూ మాస్కులు విధిగా ధరించి, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకుంటూ, ప్రజలు గుమిగూడిన ప్రదేశాలలో తిరగకుండా భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. పండుగ అనగానే ప్రయాణాలు పరిపాటి,పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పనుల కోసం తప్పా, ఊరకనే పండుగురోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా కుటుంబ సభ్యులతో ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని అన్నారు. త్వరలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసైనుకుల ద్వారా మాస్కులు, శానిటైజర్లు, పంచిపెడతామని అన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని, పండిన పంటలు ఇంటికొచ్చిన వేళలో జరుపుకొనే ఈ సంక్రాంతి పండుగలో ప్రస్తుత వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోను, మరియు జిల్లాలోను రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లేక,ధాన్యం కొనుగోలు చేయకుండా పండగంటిపూట రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్న ప్రభుత్వంగా ఈ వైస్సార్సీపీ చరిత్రలో నిలుస్తోందన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com