★ మారుతున్న ప్రజాభిప్రాయం
★ వైసీపీని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు
★దక్షిణములో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు
★ ఆటో డ్రైవర్లకు యూనిఫారాల పంపిణీ
విశాఖ, (జనస్వరం) : జనసేన పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి, పోలీస్ బ్యారెక్స్ వద్దగల ఆటో స్టాండ్ డ్రైవర్లకు యూనిఫారాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్లకు ఆయన యూనిఫారాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేక ఉందన్నారు. అమలు కానీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత ప్రజలను నిండా ముంచిందన్నారు. కరెంట్ బిల్లులతోపాటు ఇంటి పన్నులు నిత్యవసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయి అన్నారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 35 వార్డు అధ్యక్షులు త్రినాథ్, జనసేన పార్టీ నాయకులు రఘు, బొగ్గు శ్యామ్, గాజుల శ్రీను, నాగేష్, సతీష్, అశోక్, రమేష్, శ్రవణ్ , అరుణ,మంగ , అక్కమ్మ , వర , శ్రీదేవి , సీత, బొద్దా లక్ష్మి, జోతి, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com