Logo
Date of Publish : 04 October 2023, 10:02 pm
Editor : Sake Naresh

రాష్ట్ర మహిళా కమిషనా? వైకాపా మహిళా కమిషనా ??

      తిరుపతి ( జనస్వరం ) : మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు జనసేన పార్టీ PAC సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సూటి ప్రశ్న వేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల కోసమే రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తోందా? అని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైసీపీ మహిళల కోసమే కమిషన్ పనిచేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. సామాన్య మహిళలకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎందుకు నోరు మెదపరో సమాధానం చెప్పాలన్నారు. రెండు రోజుల పర్యటన కోసం తిరుపతికి వచ్చిన ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పెనుమూరు ఘటనలో బాధిత విద్యార్థిని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పాలన్నారు. బాలిక తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నా... ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదనో చెప్పాలన్నారు. వాసిరెడ్డి పద్మ... రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా కాకుండా వైసిపి మహిళా కమిషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్త శుద్ది ఉంటే పెనుమూరుకు వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com