శ్రీశైలం, (జనస్వరం) : కర్నూలు జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం,వెలుగోడు మండలంలో C.M వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని, ప్రజల పై భారం మోపము అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా కొత్తగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు 1 రూపాయ 23 పైసల భారాన్ని నష్టాల పేరుతో, సర్దుబాటు పేరుతో వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం సమంజసం కాదని, కరోనాతో పనులు లేక ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇప్పుడు ట్రూ అప్ పేరుతో కరెంట్ ఛార్జీలను పెంచడం వలన సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని, దీనిపై తక్షణం ప్రభుత్వం స్పందించి వచ్చే నెల నుండి ట్రూ అప్ ఛార్జీలను తీసివేయాలని వెలుగోడు A.E గారికి కరెంట్ ఆఫీస్ నందు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు S. శాలు బాషా, రవి తేజ, పవన్, షాహిద్ మరియు Bjp నాయకులు జయ చంద్ర తదితరులు పాల్గొన్నారు.