
శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేనపార్టీ నాయకుడు వబ్బిన సత్యనారాయణ ఆద్వర్యంలో మఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో గల మండలంలో గల గ్రామాల్లోకి జనంలోకి జనసేన అనే కార్యక్రమం నిర్వాహించాలని జనసైనికులు నిశ్చయించుకున్నారు. ఈ సమావేశం మఖ్య ఉద్దేశం జనంలో జనసేన కార్యక్రమంలో భాగంగా పార్టీ సిద్దాంతాలు వివరణ, ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయుట అని అన్నారు. జనసేన పార్టీ కీ ఓటు వేయడం వలన కలిగే ప్రయోజనాలు, గ్రామాల్లో కొత్త నాయకులు తయారు చేయడం పార్టీ మనుగడను ముందుకు తీసికొని వెళ్లడం గురించి వివరించడం జరిగింది. విశాఖపట్నంలో జరగబోయే జనవాణి (జనసేన భరోసా) కార్యక్రమంను ఉద్దేశించి పేద ప్రజాలకు హమీలు పరిష్కరం కానీ ఏమైనా సమస్యలు ఉంటే అర్జీలు స్వీకరించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలియ చేసారు.