శింగనమల, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వారి ఆదేశాల మేరకు మహిళ సాధికారత వారు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి జనసేన పార్టీ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు కృషిచేయాలని పేర్కొన్నారు. అందులో భాగంగా రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని గంగనపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకుని అందులో ఉన్న చిన్న, సన్నకారు రైతు కూలీలను ఏకం చేసి వారికి సంవత్సరానికి 75 వేల నుండి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా 15 ఎకరాల భూమిని స్వయంగా పెండ్యాల శ్రీలత వారికోసం ఏర్పాటుచేసి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేపిస్తున్నారు. ఇందులో భాగంగా 15 ఎకరాల భూమిని అరటి, టమోటా, బెండ ఇతర పంటలను సాగుచేసే విధంగా వారికి భూమి, పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించి మహిళల ఆదాయం పెంపొందే విధంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మహిళలు అంటే అమితమైన గౌరవం ఉందని వారు మహిళల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని అందులో భాగంగానే ఈ రోజు మాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి పనులను జనసేన పార్టీ చేస్తుందని ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, అనంతపురం జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, నగర కార్యదర్శి అంజి, నాయకులు కొండిశెట్టి ప్రవీణ్, గురుప్రసాద్, దండు హరీష్, మధు గ్రామరైతులు, వీర మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.