శ్రీకాళహస్తి, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి మండలం, ఏర్రగుడిపాడు ST కాలనీలో ప్రజలను పరామర్శించి, యూరప్ - NRI జనసైనికుల సహకారంతో నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ప్రభుత్వం నుండి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజలు వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, నిత్యావసర వస్తువులు కూడా అందించలేదు అని తెలియజేశారు. 50 కుటుంబాలు ఉండగా కేవలం 4 కుటుంబాలకు మాత్రమే 2,000 ఇచ్చారని, మిగిలిన వారిని ప్రభుత్వం పట్టించుకోలేదు అని, మా పేదలకు రావాల్సిన డబ్బులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో దోచుకుంటున్నారు అని ప్రజలు భాధను వ్యక్తం చేశారు. 15 రోజులుగా పనులు లేక పూరి గుడిసెల్లో బురదలో పడుకుంటున్నామని, చిన్న పిల్లలు సైతం బురదలో ఉండాల్సి వస్తుందని తెలిపారు. వారి సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, వరద ఆర్థిక సహాయం అందేలా న్యాయం జరిగేలా చూస్తామని ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com