శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా రేణిగుంట పట్టణంలో విద్యార్థులు, నియోజకవర్గ పార్టీ నాయకులు, వీరమహిళలతో కలిసి ఈ నెల 12 న జనసేన పార్టీ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న యువత ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని, యువత సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి యువత భవిష్యత్తు కోసం తొలి అడుగు వెయ్యాలని కోరడం జరిగింది. అనంతరం యువశక్తి పోస్టర్ ను ఆటోలకు అతికించి, ప్రయాణిస్తున్న యువతకి అందించి కార్యక్రమం గురించి ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నియోజకవర్గ కార్యదర్శి పాలురు ముని కుమార్, నాయకులు భాగ్య లక్ష్మి, త్యాగరాజులు, జ్యోతికుమార్, గంగా, గిరీష్, ముకేష్, సుధాకర్, అబ్బులు రెడ్డి , గాంధీ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com