
శ్రీకాళహస్తి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమం తిరుపతిలో 21-Aug-22 ఆదివారం నాడు GRR కన్వెన్షన్ హాల్ నందు ( తిరుపతి – బెంగళూరు హై వే, Opp. బాలాజీ డైరీ) నిర్వహించనున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేనపార్టీ ఇంఛార్జి వినుత కోటా మీడియా సమావేశం స్థానిక నివాస గృహం నందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి నేరుగా తీసుకుని వెళ్లి, తద్వారా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే దిశగా ఒక మంచి అవకాశం , సమస్య ఎదుర్కొంటున్న వారు నిర్భయంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిసే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రధానంగా గ్రామాలలో మౌలిక వసతులు త్రాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఇళ్ళ స్థలాలు, పెన్షన్లు, భూ కబ్జాలు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరిగే అక్రమాలు, ఇసుక దోపిడీ, కాలుష్యం ఇతరత్రా ఏ సమస్యా అయినా దీర్ఘ కాలంగా పరిష్కారం కానీ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావచ్చని తెలిపారు. ఆదివారం నాడు ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. వరకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపారు. సమస్య ఉన్న వారు నిర్భయంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ కి తెలపచ్చని, ప్రజల నుండి నేరుగా వినతులు పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, నాయకులు చందు చౌదరి, గిరీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.