Logo
Date of Publish : 23 December 2025, 5:00 pm
Editor : Sake Naresh

ఘనంగా శ్రీ వైష్ణవి ప్రగతి జూనియర్,డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

శ్రీ వైష్ణవి ప్రగతి జూనియర్, డిగ్రీ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

సత్తెనపల్లి,డిసెంబర్ 23.(జనస్వరం).

శ్రీ వైష్ణవి ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ సురేష్ ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే పరీక్షా కాలంలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారని అన్నారు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభువైన ఏసుక్రీస్తు లోక రక్షకుడిగా తన బిడ్డలను కాపాడేందుకు భూమిపైకి వచ్చాడని, ఆయన చూపించిన మార్గము ప్రేమ కరుణ శాంతి అందరిలో ఉండాలని అన్నారు. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతారని అన్నారు. ప్రభువైన ఏసుక్రీస్తు ఆశీస్సులు తన బిడ్డల సమానులైన విద్యార్థుల పట్ల ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఫాస్టర్ చేతులకి మీదగా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య కేకును కట్ చేశారు. 600 మంది విద్యార్థుల చేత ఏర్పాటుచేసిన కొవ్వొత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవి డైరెక్టర్స్ ఒంగోలు శ్రీనివాసాచారి, మాచి బట్టు సుబ్బరాజు, ఉప్పు సోమేశ్వరరావు, డేగల శ్రీనివాసరావు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com