
పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, జనసేన నాయకులకు, వీరమహిళలకు కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆమె మాట్లాడుతూ యండపిల్లి గ్రామంలో 5గురు కరోనా మహమ్మారికి బలయ్యారు అని తెల్సింది వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని అన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 20 నుండి 30 వరుకూ కరోనా కేసులు ఉన్నాయని తెల్సి బాధపడుతున్నాను. ఇటువంటి సమయాల్లో మన అందరికి కావాల్సింది మనోధైర్యం, పరిశుభ్రత మాత్రమే. ఎవరు కూడా భయాందోళనలకు గురి కావొద్దు ధైర్యమే మనకు శ్రీరామ రక్ష అని మనోధైర్యాన్ని ఇచ్చారు. మనం అందరం కూడా రోగ నిరోధక శక్తి ని పెంపొందించుకోవాలి ధైర్యమే మన ఇమ్మ్యూనిటి అని అన్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా విలయాన్ని చూసి భయాందోళనలతో ఆస్పత్రిలకు పరుగులు పెట్టి ఇంకా అనారోగ్యనికి గురయ్యే సంఘటనలు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ముందు గానే పరిశుభ్రత పాటిస్తూ ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ ఇంట్లోనే ఉంటు పోషకవంతమైన ఆహారం తీసుకోవడం లాంటివి చేస్తే కరోనాను మనం జయించినట్లే అని అన్నారు. శ్వాస ఇబ్బందులు ఎక్కువ ఉండడం లాంటి సమస్యలు ఉంటే తప్ప ఆసుపత్రికి వెళ్లొద్దని బయట ఆసుపత్రిలో కూడా పరిస్థితులు మనం చూస్తున్నాం ఆక్సిజన్ సిలిండర్లు బెడ్లు లేని దారుణమైన పరిస్థితి ఉందని అన్నారు. కరోనాని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలందరూ గమనించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోకుండ ప్రభుత్వం ఇంకా వైద్య సదుపాయాలు ఆక్సిజన్ కొరత లేకుండా చూడడం ఇలాంటి వాటిపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు.