రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ హంపీ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు వారు అనేక రకాలుగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన ధీరుడు అదేవిధంగా దేశభాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన మహానుభావుడని అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చిన మహారాజు దక్షిణ భారత దేశం మొత్తాన్ని పరిపాలన చేసిన మగధీరుడు ఆయన స్పూర్తితో మన రాష్ట్ర దేశంలో ప్రస్తుత నీచ రాజకీయాల నుండి దుర్మార్గపు పరిపాలనా పాలకుల విధానాలను జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఉద్యమిద్దాం అని యావత్తు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, కాపు సంక్షేమ సేన,సామాజిక సంగం నాయకులు, సంఘసంస్కర్తలు, ప్రముఖులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com