Logo
Date of Publish : 14 December 2025, 9:12 pm
Editor : Sake Naresh

భోగాపురం రావాడలో ఎస్‌ఆర్ ఫిట్‌నెస్ వ్యాయామశాల ప్రారంభం

విజయనగరం, అక్టోబర్ 14, (జనస్వరం) : భోగాపురం మండలం రావాడ గ్రామంలో యువత స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పడే “ఎస్‌ఆర్ ఫిట్‌నెస్” వ్యాయామశాలను నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. యువత శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవాలని, వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామాల్లో ఇలాంటి వ్యాయామ శాలలు ఏర్పడటం వల్ల ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com