స్నేహ సౌరభాలకు క్రీడలు ఎంతోదోహదం చేయడమే కాకుండా మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని జనసేనపార్టీ కుప్పం ఇన్ఛార్జ్ డాక్టర్ మువెర ఉద్ఘాటించారు. ఇటీవల జనసేవలో భాగంగా (ఇతరులకు సహాయం చేయబోయి) ప్రాణాలు పోగొట్టుకొన్న కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, తులసినాయనపల్లి జనసైనికుడు V. అశోక్ గారి జ్ఞాపకార్థం.... తులసినాయనపల్లికి చెందిన యువత వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేనపార్టీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ శ్రీ ముద్దినేని వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి అశోక్ గారి ఫోటోకి పూలమాల వేసి ఘననివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. స్నేహానికి గల విలువ లోకంలో దేనికీ సాటిరాదన్నారు. తర్వాత యువ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. మున్ముందు కూడా యువత ఎంతో కీలకమైనపాత్ర పోషించాలన్నారు. అనంతరం డాక్టర్.మువెర వాలీబాల్ పోటీలు సర్వీస్ చేసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ గారి కార్యదర్శి, ఇతర మండల కమిటి సభ్యులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com