పెనుకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెనుకొండ నూతన మండల కన్వీనర్ గా ఎన్నికైన మహేష్ ను సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా మండల కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ మండల కన్వీనర్ గా నియమించినందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు వరుణ్ గారికి మరియు నియోజకవర్గ, నాయకులుకు కృతజ్ఞతలు తెలియచేసారు. మండలంలోని ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం అయ్యేలా చూసి మరియు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గనాయకులు కుమార్, రాష్ట్ర చేనేత నాయకులు ఎర్రిస్వామి, జిల్లా కార్యదర్శి సురేష్, రొద్దం నాయకులు జుబేర్, రొద్దం కన్వీనర్ గంగాధర్, సోమందేపల్లి కన్వీనర్ జాబిల్లా, గోరంట్ల నాయకులు వెంకటేష్, పెనుకొండ లోకేష్, హర్ష, మంజునాథ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com