
పశ్చిమ గోదావరి ( జనస్వరం ) : లింగపాలెం మండల జనసైనికులు జనసేన పార్టీ బలోపేతదిశగా చేసేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేకా ఈశ్వరయ్య , పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, సంయుక్త కార్యదర్శి తూము విజయ్ కుమార్ జనసైనికులని ఉద్దేశించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క జనసైనికుడు కృషిచేయాలని సూచించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమం తదనంతరం క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.