
విజయనగరం ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు, జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసైనికులకు భరోసా, నియోజకవర్గంలో ప్రతి పల్లెలో తదుపరి కార్యాచరణ వివిధ అంశాలపై చర్చ సమావేశం నిర్వహించారు. జనసైనికులు మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామనా జనసేన జెండా ఎగరాలని, అందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు అందిస్తున్న సహాయం గూర్చి, ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాల గూర్చి సామాన్య ప్రజలకు వివరించి జనసేనపార్టీ గూర్చి తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ 2024 అధికార లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు తీసుకుపోవడంలో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, శిగా తవీటి నాయుడు, పతివాడ అచ్చం నాయుడు, వినోద్ కుమార్, మణికంఠ, చిన్న నాయుడు, రామకృష్ణ, యేసు, సూర్యనారాయణ, గణేష్, అప్పలనాయుడు, జగదీష్, శ్రీను, రమేష్, కనకరాజు, గోపాల్, సూరిబాబు, కృష్ణ, లక్ష్మణ్ జన సైనికులు పాల్గొన్నారు.