నిడదవోలు ( జనస్వరం ) : నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ మాట్లాడుతూ ప్రతి జనసైనికుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని 2024 లో పార్టీ అధికారంలోకి రావటానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ వెళ్తున్నామని అన్నారు. దానికనుగుణంగా తొలి అడుగు మోర్త గ్రామంలో పడిందని ఇక ముందు మండలములో అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతం చేయడానికి ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా మండలం మొత్తం ఒక తాటి మీద ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భoగా కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈ దేశంలో ఏ పార్టీ చెయ్యని విదంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తల కోసం జీవిత భీమా పాలసీ చేయించి, కార్యకర్తల క్షేమం కోసం ఆలోచించే పార్టీ అని నిరూపించుకున్నారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం కౌలు రైతులకు అండగా రైతు భరోసా యత్ర చేపట్టి రైతు కన్నీళ్లు తుడవటానికి బయలుదేరారన్నారు. ఈ దేశంలో ప్రజల కోసం, తన జీవితం పణంగా పెట్టి పోరాడే పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ, జిల్లా సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని, k సావరo గ్రామ సర్పంచ్ నార్ని రామక్రిష్ణ, ఎంపిటిసి కాకర్ల కరుణ, చిటికిన సూరి బాబు, దొడ్డా పండు, నవీన్, దాసరి సుబ్బు, భగవాన్, ఇర్రి మోహన కృష్ణ, ఇంద్ర, దుర్గా మల్లేష్, మరియు మోర్త జనసైనికులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.