Logo
Date of Publish : 20 June 2022, 3:06 pm
Editor : Sake Naresh

కంబరవలస గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

           పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం కంబరవలస గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మత్స పుండరీకం జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు 5 లక్షల రూపాయల జనసేన బీమా కిట్స్ పంపిణి చేశారు. అనంతరం క్రియాశీలక సభ్యులందరి చేత ప్రతిజ్ఞ చేయిoచారు. మత్స పుండరీకం మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజలకు క్రియాశీల సభ్యులు వారధిగా నిలవాలని జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇంటి౦టికి చేరవేసే విధంగా అందరూ కృషి చేయాలని, ప్రతి గ్రామo లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులంతా కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో పని చేయాలని కోరారు. జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లలని, జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. కంబరవలస గ్రామ జనసైనికులు దండేల చందు మాటలాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ప్రాణప్రదంగా ప్రేమించే కార్యకర్తల్ని జనసేన అధ్యక్షులు కూడా అదేవిధంగా ప్రేమిస్తారు అని అన్నాడు. గొడబ మహేష్ మాటలాడుతూ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాద జరిగినపుడు మెడికల్ బిల్స్ కు 50 వేల రూపాయలు అలాగే వ్యక్తిని కోల్పోతే వారి కుటుంబాాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినపుడు వారికి ఎంతో అది ఆసరాగా నిలబడుతుందన్నారు. దండేల సతీష్ మాటలాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల 50 వేల మంది క్రియాశీలక సభ్యులతో పటిష్టమైన ప్రణాలికలతో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు తథ్యం అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కంబరవలస గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కలమట పోలిష్, దండేల వంశీ, బోను సింహాచలం, సాకేటి కృష్ణమూర్తి, ఆనందరావు, దండేల మహేష్, కొమెజు సుధ, చంద్రశేఖర్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com