రాయదుర్గం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా గత సంవత్సరం ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా ఉన్నారో వారు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే కొత్త సభ్యత్వం తీసుకోలేని వారు కూడా తీసుకోవాలని కోరారు. రెన్యూవల్ చేసుకున్నవారు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే వారికి 5 లక్షల రూపాయల సహాయం.. అదే విధంగా ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. రాయదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రదానకార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు కిరణ్ కుమార్ జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.