
కృష్ణా ( జనస్వరం ) : కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేశారు. కొత్తపల్లిలోని ఆంజనేయస్వామి గుడిలో జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామ్ గారు ప్రేత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేసిన పాదయాత్రగా భారీ జనాసమూహంతో రోడ్లు కిటకిటలాడాయి. అనంతరం Dr. B R అంబేద్కర్ గారికి ఘన నివాలర్పించారు. ఆయన మాట్లడుతూ కొత్తపల్లి జనసైనికుల సేవలు మరువలేనివని ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు సాగాలని, అలాగేఅన్ని గ్రామాలు కూడా కొత్తపల్లి జనసైనికులని ఆదర్శంగా తీసుకుని నిత్యం ప్రజల్లో ఉండాలి అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నూటికినూరు శాతం జనసేన పార్టీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు, అన్ని కులాలు వారు బడుగు బలహీనవర్గ ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం అని విశేష స్పందన లభిస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గంలోని రాష్ట్ర కార్యవర్గం, 4 మండలాల జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.