
కోడుమూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని పసుపల గ్రామంలో జనసేన పార్టీ బలోపేత దిశగా కార్యకర్తలకు జనసేన నాయకులు దిశా నిర్దేశం చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మన జిల్లాలో జరిగిన కౌలు రైతు సభ విజయవంతంగా జరిగిందని అన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ పార్టీ పట్ల నిబద్ధతో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, కృష్ణ బాబు, కైసర్, రాజు జనసేన నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వై బజారి, పసుపుల గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.