
రైల్వేకోడూరు నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకుడు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ మనసా, వాచా, కర్మణ జనసేన పార్టీ కోసం పనిచేసే జన సైనికులందరు ఏకతాటిపైకి వచ్చి , బహుజనులను కలుపుకు పోతూ ప్రజలలో పార్టీ సిద్ధాంతాలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. రాజకీయ చైతన్యం లేనిదే రాజ్యాధికారం సాధించలేరని తెలిపారు. పార్టీ బలపడాలి అంటే రాజకీయ పరిణతి మేధస్సు వాక్చాతుర్యంతో పాటు నిస్వార్ధంగా పని చేసే నాయకులు యువ కార్యకర్తలు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలపై వివరిస్తూ అధికార ప్రతిపక్షాలు ప్రజల మనోభావాలపై సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మూడవ ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా దూసుకుపోతుందని అందుకోసం ప్రతి కార్యకర్త చీమల దండుల నిబద్ధతతో క్రమశిక్షణతో నిలకడగా ఓర్పుతో హంగు ఆర్బాటం లేకుండా సంఘీభావంతో పనిచేయాలని కోరారు మరియు రైల్వేకోడూరు జనసేన పార్టీ స్థానికనాయకత్వం అసూయ ద్వేషాలుకి పోకుండా కార్యకర్తలను యువతను కలుపుకుపోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీవ్రంగా వస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయక సుమారు 100 మంది ఐదు మండలాల నుండి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పెనగలూరు , చిట్వేలి, పుల్లంపేట , ఓబులవారిపల్లె, కోడూరు మండలాలకు చెందిన పలువురు జనసేన కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను పార్టీ పైనున్న గౌరవాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామతీర్థం సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ కార్యకర్తలకు కార్యక్రమం చివరలో భోజన సదుపాయాన్ని గంధం శెట్టి దినకర్ బాబు, ఎదల అనంత రాయలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరికూటి నాగరాజు, సెట్టిగుంట నాగేశ్వరరావు, పురం సురేష్ బాబు, బండారు శివ, అంకి పల్లి అఖిల్, చవ్వాకుల రెడ్డి మనీ, సాయం విద్యాసాగర్, పూజారి సుబ్రహ్మణ్యం, వెంకట్, కటకం మణి, నగిరిపాటి మహేష్, మర్రి రెడ్డి ప్రసాద్, సాయి, భాస్కర్, సుబ్రహ్మణ్యం, మనీ, శివ తదితరులు పాల్గొన్నారు.