ఉరవకొండలో జనసైనికుల ఆత్మీయ సమావేశం
ఉరవకొండ నియోజకవర్గ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏ వింధంగా ముందుకు వెళ్లాలి.క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తగిన సూచనల గూర్చి స్థానిక చౌడేశ్వరి దేవాలయ ప్రాంగణంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 700+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ బలోపేతం గూర్చి చర్చించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.