
శృంగవరపు కోట ( జనస్వరం ) : వేపడ మండల జనసేన పార్టీ అధ్వర్యంలో సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. జనసేనపార్టీ వేపాడ మండలం అద్యక్షులు సుంకర అప్పారావు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన ఎస్.కోట నియోజకవర్గ సీనియర్ నాయకులు వబ్బీన సన్యాసి నాయుడు ప్రసంగిస్తూ రాబోయే 100 రోజులు టీడీపీ జన సేన ఉమ్మడి మానిఫెస్టోని ప్రజలకు వివరించారు. వైసీపీ పార్టీని గద్దె దించి జనసేణ టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని జనసేన ఆక్టివ్ మెంబెర్స్ కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.