పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా, జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జనసేన జెండా పట్టుకుని పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పని చేస్తున్న కియా సభ్యులను గుర్తించి వారికి ఆపదలో హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం 50 వేలు, అనుకోకుండా కాలం చెల్లితే వారి కుటుంబానికి భరోసాగా 5 లక్షల రూపాయలు ఇచ్చేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం జరుగుతుందని అని అన్నారు. క్రియాశీలక సభ్యులు ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా జరగాలని, ఇన్సూరెన్స్ పాలసీలు కోసం వేరే పార్టీ నుంచి మన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కావున సభ్యులు చేర్చే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యకర్తలను మిగతా పార్టీలు వాడుకుంటాయి కానీ మన జనసేన పార్టీ కి జనసైనికులు భద్రతే ముఖ్యం అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడారు అని చెప్పడం జరిగింది. పర్యావరణ జనరల్ సెక్రటరీ శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పెందుర్తి నియోజవర్గంలో ప్రజలు ఎప్పుడూ నాయకులు మోసం చేయలేదని నాయకులు మాత్రమే ప్రజలను మోసం చేశారని, రాబోయే రోజుల్లో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ బలం పుంజుకుంటుందని, మీరందరూ కలిసికట్టుగా క్రియాశీలక సభ్యత్వం పండగ వాతావరణంలో జరగాలని సూచించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థులు జనార్ధన శ్రీకాంత్, వన్నెం సతీష్ కుమార్, మధు, ఈశ్వరరావు, జడ్పిటిసి అభ్యర్థి రామారావు, ఎంపీటీసీ అభ్యర్థులు శివ, రవి, అప్పారావు, మండల నాయకులు సన్యాసినాయుడు గారు, రామ్ నాయుడు గారు, వీర మహిళ పార్వతి గారు, జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com