కర్నూలు ( జనస్వరం ) : ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ & టిడిపి పార్టీల సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ చింతా సురేష్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం అంబేద్కర్ నగర్ దిన్నదేవరపాడు- 2 లో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీల కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి ఏవిధంగా చేయాలి. పార్టీని ఏ విధంగా బలపరుచుకోవాలని అనే అంశం మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.