
శ్రీశైలం ( జనస్వరం ) : శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జనసేన నాయకులు శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి కార్తీక్ గౌడ్ విచ్చేశారు. జనసేన నాయకులు సాయి కార్తీక్ పార్టీ కార్యకర్తలతో, జనసైనికులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా ముందుకు రావాలని దానికి తగ్గట్లుగా ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారు. రాబోయే రోజుల్లో శ్రీశైలం నియోజకవర్గలో జనసేన పార్టీని అడ్డాగా మార్చాలని జనసేన కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు మండల జనసైనికులు అరుణ్, సూరి, శ్యామ్, హబిబుల్ల, వెలుగోడు మండల జనసైనికులు శాలు భాష, వీర మహిళ సుకన్య, శ్రీశైలం మండల జనసైనికులు బుజ్జి, మహానంది మండల జనసైనికులు, రామయ్య, సురేంద్ర, అబృహమా తదితరులు పాల్గొన్నారు.