మంగళగిరి, (జనస్వరం) : మంగళగిరి మండలం, కృష్ణయ్య పాలెం గ్రామంలో జనసేనపార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలతో మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, వీర మహిళలకు పార్టీ అండగా ఉంటుంది. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి అందరం కృషి చేయాలి. సొంత డబ్బులను ఆపదలో ఉన్న ప్రజలకు పంచి పెడుతున్న ఏకైక నాయకుడు, రాజధాని రైతులకు మొదటిగా అండగా నిలిచింది పవన్ కళ్యాణ్. త్వరలో కృష్ణయపాలెంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. అలాగే ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం మూడో విడత ప్రారంభమవుతుంది. కృష్ణా పాలెంలో కూడా మీ వంతు సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కొందరు మహిళలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో జనసేనకు మహిళల సపోర్ట్ ఉంటుందని కృష్ణాయపాలెంలో మహిళలమే గడప గడపకు తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి వివరిస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో MTMC అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రామా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, MTMC కమిటీ కార్యదర్శులు బళ్ళ ఉమామహేశ్వరరావు, కట్టెపోగు సురేష్, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, పిల్లి నాగభూషణం, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి కిషోర్, అప్పికట్ల శివ బాబు, కృష్ణయ్య పాలెం గ్రామ నాయకులు వెంకటేష్, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, నూతక్కి గ్రామ నాయకులు షేక్ నాగుల్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, పెనుమాక గ్రామ జనసైనికులు, కృష్ణయపాలెం గ్రామ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com