
పుట్టపర్తి, (జనస్వరం) : ఓబులదేవరచెరువు మండలం కొండకమార్ల పంచాయతీలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా, జనసేన శ్రేణులను ఉత్తేజపరుస్తూ నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగినది. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ , కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దంటూ జనసైనికులకు భరోసానిస్తూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అందరూ కలసి ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలని కార్యకర్తలకు నిర్ధేశించారు. ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసిన ప్రతి ఒక్క జన సైనికులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే ఓబులదేవరచెరువు మండలం కొండకమార్ల పంచాయతీ గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలని, పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చెయ్యాలని, త్వరలో పార్టీ మండల కమిటీలు వేస్తారని మండల నాయకుడు మేకల ఈశ్వర్ గారు తెలపారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కొండబోయన సతీష్, బాబా, కేశవ నాయక్, శ్రీను, ప్రసాద్, నవీన్, బాలు, బాబ్ జాన్, తదితురులు పాల్గొన్నారు.